
మెదక్, 14 ఫిబ్రవరి (హి.స.)
నర్సాపూర్ మున్సిపాలిటీపై గులాబీ
జెండా ఎగురవేస్తామని ప్రజలు తమ పార్టీకి ఇచ్చిన తీర్పును శిరసావా ఇస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో సర్టిఫికెట్లను తీసుకున్నారు. ఈ సందర్భంగా సునీత రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ అధికారం అడ్డుపెట్టుకొని తమ పార్టీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేసిన బీఆర్ఎస్ పార్టీకి ఐదు సీట్లు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ నాయకులు అన్ని రకాల ప్రలోభాలకు గురిచేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేశారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన వారికి పంపిణీ చేస్తామని తెలిపారు. నర్సాపూర్ పట్టణం అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కండెల రాజు, మొయిజుద్దీన్, ఒంటెద్దు సునీత, పంబల్ల లలిత, సమీనా బేగం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్ర గౌడ్, మన్సూర్, గోపి, దొంతి సంతోష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, నాగరాజు జ్ఞానేశ్వర్ శ్రవణ్, తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..