గతాన్ని మార్చలేము.. కానీ రేపు కొత్త ఆరంభమే.. పాక్ క్రికెటర్ సల్మాన్ అఘా ఆసక్తికర వ్యాఖ్యలు!
హైదరాబాద్, 14 ఫిబ్రవరి (హి.స.) సిరీస్ ఏదైనా సరే భారత్, పాకిస్తాన్ మ్యాచులకు ఉండే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటీ టీ20 ప్రపంచకప్ ఇరు జట్లు పోటీ పడుతున్నాయంటే.. ప్రపంచంలో ఏ మూలన మ్యాచ్ జరిగినా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అలాంటి మ్యాచ్ పై మ
Cricketer


హైదరాబాద్, 14 ఫిబ్రవరి (హి.స.)

సిరీస్ ఏదైనా సరే భారత్, పాకిస్తాన్ మ్యాచులకు ఉండే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటీ టీ20 ప్రపంచకప్ ఇరు జట్లు పోటీ పడుతున్నాయంటే.. ప్రపంచంలో ఏ మూలన మ్యాచ్ జరిగినా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అలాంటి మ్యాచ్ పై మొన్నవరకు నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. పాకిస్తాన్ జట్టు భారత్ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపు (ఫిబ్రవరి 15)న జరగబోయే భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఈ మెగా పోరుకు ముందు పాకిస్తాన్ క్రికెటర్ సల్మాన్ అలీ అఘా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచకప్ వేదికలపై భారత్తో తలపడిన ప్రతిసారి పాకిస్థాన్ ఓటమి పాలవుతున్న చరిత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. భారత్పై మాకు మంచి రికార్డు లేదన్నది వాస్తవం. కానీ గడిచిపోయిన చరిత్రను మనం మార్చలేం. అయితే, ప్రతి రోజూ ఒక కొత్త ఆరంభమే (Every day is a new day). రేపటి మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రాక్టీస్ సెషన్ తర్వాత మీడియాతో మాట్లాడిన సల్మాన్ అలీ ఆఘా.. టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పై ప్రశంసల జల్లు కురిపించారు. స్టమక్ ఇన్ఫెక్షన్ కారణంగా గత రెండు మ్యాచ్లకు దూరమైన అభిషేక్, పాక్తో మ్యాచ్ నాటికి కోలుకుంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అభిషేక్ శర్మ అత్యుత్తమ ఆటగాడు. మేం ఎప్పుడూ అత్యుత్తమ జట్టు తో తలపడి మా సత్తా చాటాలని కోరుకుంటాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అని సల్మాన్ తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande