మున్సిపల్ ఎలక్షన్స్ ట్రైలరే.. అసలు సినిమా ఉంది: తెలంగాణ జాగృతి చీఫ్ కవిత
హైదరాబాద్, 14 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జ్యోజీ రెడ్డి(
Kavita


హైదరాబాద్, 14 ఫిబ్రవరి (హి.స.)

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జ్యోజీ రెడ్డి(Ambati Joji Reddy), HMS కార్యదర్శి రియాజ్ అహ్మద్ (Riyaz Ahmed)లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తాజా ఎన్నికలు తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ఓ ట్రైలర్ మాత్రమేనని, అసలు 'సినిమా' ముందుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కూటమి అద్భుతమైన ప్రతిభకనబరిచిందని కవిత పేర్కొన్నారు. తాము రాజకీయ పార్టీగా మారబోతున్నామని ప్రకటించిన తక్కువ సమయంలోనే ప్రజలు మమ్మల్ని ఆదరించారని గుర్తు చేశారు. జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన అభ్యర్థుల్లో 40 మంది విజయం సాధించారు. ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాకు స్పష్టమైన మెజార్టీ లభించిందని ఆమె వెల్లడించారు. అధికారికంగా 33 స్థానాలు వచ్చినప్పటికీ, మరో 7 చోట్ల బీ ఫామ్ సాంకేతిక కారణాల వల్ల స్వతంత్రులుగా గెలిచింది కూడా తమ అభ్యర్థులేనని కవిత స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది..

గతంలో 90 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ (BRS), ఇప్పుడు కేవలం 16 స్థానాలకే పరిమితమైందని కవిత అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని కామెంట్ చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ (BJP) గెలుపు కోసం బీఆర్ఎ ఎస్ నేతలు పరోక్షంగా సహకరించారని, ఇది ఆ రెండు పార్టీల పొత్తుకు తొలిమెట్టు అని ఆరోపించారు. కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ మీద చేసిన ఆరోపణలను ఇప్పుడు సీపీఐకి మద్దతు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ అంగీకరిస్తోందా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందని, చాలా చోట్ల రీకౌంటింగ్ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande