. జీ ముగ్గుల.మొదలమ్మత్యపురం వద్ద 1000 కిలోల గంజాయి పట్టివేత
పాడేరు, 15 ఫిబ్రవరి (హి.స.): జి.మాడుగుల మండలంలోని మత్స్యపురం కూడలి వద్ద శనివారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం నుంచి అంతర్గత మార్గాల ద్వారా బొలెరో వాహనంలో తరలిస్తున్న 1000 కిలోల గంజాయిను పోలీసులు పట్టుకున్నారు
. జీ ముగ్గుల.మొదలమ్మత్యపురం వద్ద 1000 కిలోల గంజాయి పట్టివేత


పాడేరు, 15 ఫిబ్రవరి (హి.స.): జి.మాడుగుల మండలంలోని మత్స్యపురం కూడలి వద్ద శనివారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం నుంచి అంతర్గత మార్గాల ద్వారా బొలెరో వాహనంలో తరలిస్తున్న 1000 కిలోల గంజాయిను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు అల్లూరు జిల్లాకు చెందిన చెందిన వారు కాగా.. ఒకరు అనకాపల్లి జిల్లా, మరొకరు ఒడిశాకు చెందినవారుగా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులకు పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పాడేరు డీఎస్పీ అభిషేక్ వెల్లడించారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande