
విజయవాడ, 15 ఫిబ్రవరి (హి.స.): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే ప్రజలకు నిరాశ, నిస్పృహ కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బడ్జెట్ మోసపూరిత బడ్జెట్.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక అవస్థలు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
..నాడు-నేడు స్కీమ్‌ను సమాధి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ ఉంటే వైఎస్సార్, జగన్‌కు పేరొస్తుందని భయం. ఆరోగ్యశ్రీని రద్దు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిని ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.
3
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు