ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం భవనాలు మాత్రమే కాదు, అవి విజ్ఞాన కేంద్రాలు.. భట్టి విక్రమార్క
ఖమ్మం, 15 ఫిబ్రవరి (హి.స.) భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదవడం మా అదృష్టంగా విద్యార్థులు భావించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ
భట్టి విక్రమార్క


ఖమ్మం, 15 ఫిబ్రవరి (హి.స.)

భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో

చదవడం మా అదృష్టంగా విద్యార్థులు భావించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 48వ వార్షిక సంచికను ఆవిష్కరించిన ఆయన, విద్యా రంగం పై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు.

అత్యాధునిక వసతులతో పాఠశాలల పునర్నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం భవనాలు మాత్రమే కాదని, అవి విజ్ఞాన కేంద్రాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, డిజిటల్ విద్యా విధానం, తరగతి గదుల నిర్మాణం, తాగునీటి వసతి, బాలికలకు ప్రత్యేక వసతులు, లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

ప్రపంచంతో పోటీ పడేలా 'యంగ్ ఇండియా' స్కూల్స్, తెలంగాణ బిడ్డలు ప్రపంచ దేశాలతో పోటీ పడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో 100 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మాణాలను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, అందుకే ప్రజా ప్రభుత్వం విద్య పై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande