హైదరాబాద్ విమానానికి బాంబ్ బెదిరింపు..
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.) శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Shamshabad Airport) మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం సింగపూర్, హైదరాబాద్(Singapore Hyderabad Flight)లో బాంబు పె
బాంబు బెదిరింపు


బాంబు బెదిరింపు


హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Shamshabad Airport) మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం సింగపూర్, హైదరాబాద్(Singapore Hyderabad Flight)లో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులను దింపేసి, విమానంలో తనిఖీలు చేపట్టారు. ఎక్కడ బాంబ్ లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి నేటి వరకు అంటే రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు 23 నకిలీ బెదిరింపు కాల్స్ వచ్చాయని అధికారులు వివరించారు. ఈ తరహా ఘటనలకు పాల్పడిన పలువురిని ఇప్పటికే గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరికొంత మంది విదేశాల నుంచి ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో బహిర్గతం కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande