
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)మొయినాబాద్: తెలంగాణలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులు ఎక్కడ జంప్ జిలానీ అంటారో అని ఆయా పార్టీలు వారిని డేగ కళ్లతో కనిపెడుతున్నాయి.
దీనిలో భాగంగా వారిని క్యాంప్‌లకు తరలిస్తూ దాచేయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రిసార్ట్‌ల్లో దాస్తున్న అభ్యర్థులను డైరెక్ట్‌గా చైర్మన్, మేయర్ ఎన్నికకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థులు చేయి జారకుండా పార్టీల జాగ్రత్తలు పడుతున్నాయి. మధ్యలో గ్యాప్ ఇస్తే అభ్యర్థులు మాయమైపోతారనే భయంలో పార్టీలు ఉన్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు