జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రాజ్యసభ?.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో .త్వరలోనే కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? మంత్రి అజారుద్దీన్ను పదవి గండం నుంచి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేస్తున్నారా? పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ప్రకారం అవుననే
జస్టిస్


హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో .త్వరలోనే కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? మంత్రి అజారుద్దీన్ను పదవి గండం నుంచి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేస్తున్నారా? పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యూహ రచన చేస్తున్నారని ఈ దెబ్బతో ఇటు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ, త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి మార్గం సుగమమం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం ఆసక్తిగా మారింది.

రాజ్యసభకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి?:

తెలంగాణలో ఈ ఏడాది రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ వచ్చే ఏప్రిల్లో పదవి విరమణ చేయబోతున్నారు. అసెంబ్లీలో ఉన్న బలాబలాల మేరకు ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుందని ఈ క్రమలో ఈ స్థానాల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ రెండు స్థానాలు ఎవరికి ఇవ్వాలనే విషయంలో హైకమాండ్ పరిశీలనలు చేస్తుండగా ఒకటి జాతీయ స్థాయి, మరొకటి తెలంగాణ మూలాలు కలిగిన వ్యక్తికి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఒక స్థానానికి గతేడాది ఇండియా కూటమి తరఫున రాష్ట్రపతి బరిలో ఉన్న జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, మరోక స్థానానికి తిరిగి అభిషేక్ సింఘ్వీ పేర్లను పార్టీ పరిశీలిస్తుండగా ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం అధిష్టానం పెద్దలతో చర్చించారని పేర్కొంది. అయితే సుదర్శన్ రెడ్డి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని ఈ కథనం స్పష్టం చేసింది. అలాగే సుదర్శన్ రెడ్డితో పాటు సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి పేరు సైతం రాజ్యసభ రేస్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande