
తాడేపల్లి,, 15 ఫిబ్రవరి (హి.స.): తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై ఆదివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి గుంటూరు వైపు ద్విచక్ర వాహనాల లోడ్‌తో వెళ్తున్న ఓ కంటైనర్ లారీ డీజిల్ ట్యాంక్‌లు ఒక్కసారిగా జారిపడ్డాయి. దీంతో ఆ వాహనం రహదారిపై నిలిచిపోయింది. డీజిల్ ట్యాంక్‌లు జారిన సమయంలో వెనకవైపు నుంచి వాహనాలేవీ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 2 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ