మొదటి రోజే 1.89 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో కపుల్ ఫ్రెండ్లీ మూవీ రికార్డ్
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.) సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. యోగి బాబు, రాజీవ్ కనకాల ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించగా, అశ్విన్ చంద్రశేఖర్ రచన, దర్శకత్వం వహించారు. ఆదిత్య రవీంద్రన్ స
Movie record


హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)

సంతోష్ శోభన్, మానస వారణాసి

జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. యోగి బాబు, రాజీవ్ కనకాల ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించగా, అశ్విన్ చంద్రశేఖర్ రచన, దర్శకత్వం వహించారు. ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ చిత్రానికి మంచి టాక్ దక్కింది. దాంతో మొదటి రోజు మంచి కలెక్షన్లు కూడా దక్కాయి. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాకి ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 1.89 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది.

మొదటి రోజు మంచి టాక్ రావడం, అలాగే మంచి ఓపెనింగ్స్ దక్కడంతో లాంగ్ రన్లో ఈ మూవీ మంచి వసూళ్లను సాధించి సూపర్ సక్సెస్ను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సంతోష్ శోభన్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఆయనకు ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు. చాలా కాలం క్రితం ఈయన ఏక్ మినీ కథ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు, కానీ ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande