
ఖమ్మం, 15 ఫిబ్రవరి (హి.స.)
మహా శివరాత్రి పర్వదినాన్ని
పురస్కరించుకొని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులు ఆదివారం ఖమ్మం జిల్లా మధిర లోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి వారిని దర్శించుకున్నారు. మధిర మండల కేంద్రంలోని వైరా నది ఒడ్డున ఉన్న గంగా పార్వతి సమేత మృత్యుంజయ స్వామి దేవాలయానికి డిప్యూటీ సీఎం దంపతులు చేరుకున్నారు. వారికి ఆలయ ఈవో ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దంపతులచే స్వామివారికి రుద్రాభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి గర్భాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రుల పేరిట గోత్రనామాలతో అర్చన చేయించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు దంపతులు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు