రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఎవరు1 నుంచి ఉచితవిద్యుత్
అమరావతి, 15 ఫిబ్రవరి (హి.స.), :రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందించనుంది. ఎన్నికల సమయంలో చేనేతలకు 200 యూనిట్లు, పవర్‌ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగా
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఎవరు1 నుంచి ఉచితవిద్యుత్


అమరావతి, 15 ఫిబ్రవరి (హి.స.), :రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందించనుంది. ఎన్నికల సమయంలో చేనేతలకు 200 యూనిట్లు, పవర్‌ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలో అర్హులైన నేత కుటుంబాల ఎంపిక పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో నేతన్నల ఉచిత విద్యుత్‌కు సంబంధించి నిధులు కేటాయించడంతో ఏప్రిల్‌ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నల కుటుంబాల తరపున చేనేత జౌళి శాఖ మంత్రి సవిత.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande