బడ్జెట్ లో 202627 విద్యా రంగానికి ప్రాధాన్యం
అమరావతి, 15 ఫిబ్రవరి (హి.స.)విద్యా రంగానికి 2026-27 బడ్జెట్‌లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తంగా విద్యా రంగానికి 36,107 కోట్లు కేటాయించింది. ఇది మొత్తం బడ్జెట్‌లో సుమారుగా 11 శాతం. పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.1
బడ్జెట్ లో 2026*27 విద్యా రంగానికి ప్రాధాన్యం


అమరావతి, 15 ఫిబ్రవరి (హి.స.)విద్యా రంగానికి 2026-27 బడ్జెట్‌లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తంగా విద్యా రంగానికి 36,107 కోట్లు కేటాయించింది. ఇది మొత్తం బడ్జెట్‌లో సుమారుగా 11 శాతం. పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.1500 కోట్లు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తారు. ఉన్నత విద్యా శాఖకు రూ.2567 కోట్లు కేటాయించింది. యువతకు నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దేందుకు.. నైపుణ్యాభివృద్ధి- శిక్షణ శాఖకు రూ.1,232 కోట్లు కేటాయించింది. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఏటా రూ.15వేలు ఇచ్చే తల్లికి వందనం పథకానికి రూ.9,668 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్యలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మెయింటెనెన్స్‌ ఫీజుల కింద రూ.3,836 కోట్లు, పాఠశాల విద్యలో సమగ్రశిక్ష విభాగానికి భోజనం పథకానికి రూ.2161 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర(స్టూడెంట్‌ కిట్లు)కు రూ.654 కోట్లు కేటాయించింది. మొత్తంగా విద్యా రంగానికి బడ్జెట్‌లో దాదాపు 11శాతం నిధులు కేటాయించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande