ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ..కల్వకుంట్ల కవిత ప్రకటన
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.) బీఆర్ఎస్ పార్టీకీ రాజీనామా చేసి.. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన గ్రామ పంచాయతీ, మున్సినల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా వారు పోటీ చేయలేదు.
Kavita


హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)

బీఆర్ఎస్ పార్టీకీ రాజీనామా చేసి..

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన గ్రామ పంచాయతీ, మున్సినల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా వారు పోటీ చేయలేదు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కవిత అనుచరులు పలు మున్సిపాలిటీల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాగా త్వరలోనే రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఏ గుర్తుపై పోటీ చేస్తామనేది ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొంటూ కవిత రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపారు.

ఈ ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ క్షేత్రస్థాయి రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. సాంస్కృతిక, సేవా కార్యక్రమాలకే పరిమితమైన తెలంగాణ జాగృతిని ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించడం ద్వారా తన రాజకీయ వ్యూహాన్ని కవిత మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం పార్టీ ప్రచారం కోసమే కాకుండా, స్వతంత్ర శక్తిగా గ్రామస్థాయిలో క్యాడర్ను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ అడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రధాన రాజకీయ పార్టీల సమీకరణలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande