జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమము
మంగళగిరి, 15 ఫిబ్రవరి (హి.స.)జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు (ఫిబ్రవరి 15న) ఉదయం డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమము


మంగళగిరి, 15 ఫిబ్రవరి (హి.స.)జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు (ఫిబ్రవరి 15న) ఉదయం డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande