
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)
కొత్తగూడెం (Kothagudem
Corporation) రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పొత్తులో ఉన్న కాంగ్రెస్-సీపీఐ మధ్య ఒప్పందం జరిగితే ఇబ్బందేం లేదని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామన్నాం... కాంగ్రెస్, బీజేపీ సింగరేణిని దోచుకుంటున్నాయని చెప్పాం.. ఏ కారణం చేత పొత్తుకు సీపీఐ ఒప్పుకుందో, ఏం ఒత్తిళ్లు ఉన్నాయో మాకు తెలియదని కేటీఆర్ అన్నారు.
హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకెళ్లి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పోలీసులను, గుండాలన ఇళ్లకు పంపి బెదిరింపులకు గురిచేస్తున్నారు. అయినా ఎక్కడా బెదరకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ధైర్యంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇంకా కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠంపై క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, సీపీఐ ఒక అవగాహనకు వచ్చాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించాయి. మొదటి రెండున్నరేళ్లు సీపీఐకి, ఆ తర్వాత కాంగ్రెస్కు మేయర్ పీఠం దక్కనుంది. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి (కాంగ్రెస్-22, సీపీఎం-1) 23 డివిజన్లలో విజయం సాధించింది. సీపీఐకి 22, బీఆర్ఎస్-8, బీజేపీ-1, స్వతంత్రులు 6 డివిజన్లలో గెలుపొందిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..