ఎమ్మెల్సీలపై సస్పెన్స్: కొనసాగుతోంది
సుప్రీంకోర్టు వచ్చే మార్చి 19 వరకు వాయిదా
ఎమ్మెల్సీలపై సస్పెన్స్: కొనసాగుతోంది


హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)ఎమ్మెల్సీలపై సస్పెన్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ 2025 అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిథ్యం లేకుండానే అజారుద్దీన్ ను రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లో అంటే వచ్చే ఏప్రిల్ 30 నాటికి ఎమ్మెల్సిగానో లేదా ఎమ్మెల్యేగానో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే మంత్రి పదవికి గండం ఏర్పడినట్లే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా శాసనసభకు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఇక ఎమ్మెల్సీగానే గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ల పదవుల విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అయితే ప్రొ. కోదండరామ్, అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నియమించాలని కేబినెట్ నిర్ణయించినా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండటం వల్ల ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసును సుప్రీంకోర్టు వచ్చే మార్చి 19 వరకు వాయిదా వేసింది. ఆలోపు ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవని గత విచారణలో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande