
వేములవాడ, 15 ఫిబ్రవరి (హి.స.)
దక్షిణ కాశీగా పేరుగాంచిన
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి జాతర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం వేకువజామున నుండే భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. మరోవైపు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జాతరకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో బేబీ ఫీడింగ్ కేంద్రంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్స కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కొరకు 60 వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. పట్టణ పరిధిలో 7 చోట్ల సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు