హైవే నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది : మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట, 15 ఫిబ్రవరి (హి.స.) కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గూడెబల్లూర్ నుంచి జడ్చర్ల వరకు దాదాపు 80 కిలోమీట్ల వరకు రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పనులు త్వరలోనే ప్రారంభిచనున్నట్టు మంత్రి వాకిట
Vaakiti


నారాయణపేట, 15 ఫిబ్రవరి (హి.స.)

కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గూడెబల్లూర్ నుంచి జడ్చర్ల వరకు దాదాపు 80 కిలోమీట్ల వరకు రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పనులు త్వరలోనే ప్రారంభిచనున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మక్తల్ నుంచి నారాయణపేటకు రూ.200 కోట్లతో 30 కిలోమీటర్ల రోడ్డుకు మంజూరు కావడంతో మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్ నియోజకవర్గంలో 38, నారాయణపేటలో 42వేలు, కొడంగల్ 48 వేల ఎకరాలు భూమి సాగుబడులకు రావడం అందుకు ప్రభుత్వం రూ. 4500 కోట్లతో పనులు త్వరలో ప్రారంభం కావడం జరుగుతుందని తెలిపారు. ఈ పనులన్నింటిని హైబ్రిడ్ యాన్యుటిమోడ్ పద్దతిలో చేయడం.. ఇందులో కేంద్రం 60 శాతం ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వరకు భరిస్తాయి. ఈ విధానంలో ముఖ్యంగా 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న రోడ్లను డబుల్ వే, ఫోర్ వేలుగా మారుస్తున్నారు. మక్తల్-నారాయణపేట రోడ్డు పనులు జరుగుతాయని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నాణ్యమైన రోడ్ల నిర్మాణం, భూసేకరణ ఇబ్బందులు లేకుండా చేయడం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేసిన ఏజెన్సీలే 5 నుంచి 10 సంవత్సరాల పాటు వాటి నిర్వహణ బాధ్యత తీసుకుంటారు. ప్రస్తుతం కొన్ని ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీలతో పనులు వేగవంతం చేస్తోంది. ఈ పద్దతిలో తెలంగాణలో పల్లెలకు కూడా తారు రోడ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande