శివరాత్రి పర్వదిన వేళ ఏంటి.ఆర్ ట్రస్ట్30 వ వసంతం లోకి అడుగు పెడుతోంది
అమరావతి, 15 ఫిబ్రవరి (హి.స.)5:దశాబ్దాల క్రితం స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు.. సమాజ సేవే పరమావధిగా నేటికీ కొనసాగుతున్నాయి. అలాంటి ఈ ట్రస్ట్ నేడు.. అంటే ఆదివారం శివరాత్రి పర్వదినం వేళ 30వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమ
శివరాత్రి పర్వదిన వేళ ఏంటి.ఆర్ ట్రస్ట్30 వ  వసంతం లోకి అడుగు పెడుతోంది


అమరావతి, 15 ఫిబ్రవరి (హి.స.)5:దశాబ్దాల క్రితం స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు.. సమాజ సేవే పరమావధిగా నేటికీ కొనసాగుతున్నాయి. అలాంటి ఈ ట్రస్ట్ నేడు.. అంటే ఆదివారం శివరాత్రి పర్వదినం వేళ 30వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ ఖాతా వేదికగా ఇలా స్పందించారు. 'తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం పరితపించిన మహనీయుడు, అధికారం అంటే పేదల సేవ అని భావించిన నాయకుడు.. నందమూరి తారక రామారావు గారి ఆశయాలను, సేవలను కొనసాగించేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రస్థానం సాగుతోంది. ట్రస్ట్ స్థాపించి నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను' అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande