ఉగ్రవాద కుట్రలపై ముంబై ఏటీఎస్ అధికారుల సర్జికల్ స్ట్రైక్..
ముంబై, 15 ఫిబ్రవరి (హి.స.) విధ్వంసం సృష్టించేందుకు జరుగుతున్న ఉగ్రవాద కుట్రలను భగ్నం చేస్తూ ముంబై ఎ టి ఎస (Terrorist conspiracies) అధికారులు (Mumbai ATS officers) మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా భారీ సోదాలు(Massive searches) నిర్వహిస్తున్నారు. ఉగ్ర
Mumbai


ముంబై, 15 ఫిబ్రవరి (హి.స.)

విధ్వంసం సృష్టించేందుకు

జరుగుతున్న ఉగ్రవాద కుట్రలను భగ్నం చేస్తూ ముంబై ఎ టి ఎస (Terrorist conspiracies) అధికారులు (Mumbai ATS officers) మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా భారీ సోదాలు(Massive searches) నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి, యువతను తీవ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే యవత్మాల్, అహల్య నగర్ (అహ్మద్ నగర్) జిల్లాల్లోని మొత్తం 21 ప్రాంతాల్లో ఏటీఎస్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.

యవత్మాల్ జిల్లాలోని పుసాద్, ఉమరేఖేడ్లలో 14 చోట్ల, అహల్యానగర్లో 7 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. విదేశీ ఉగ్రవాద సంస్థలతో కాంటాక్ట్ ఉంటూ, స్థానిక యువతను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దింపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఈ క్రమంలో అనుమానిత నివాసాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాద నెట్వర్ను ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ఈ సోదాలపై ఏటీఎస్ అధికారులు అధికారికంగా స్పందించాల్సిన ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande