రేపటినుండి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం.. నిజామాబాద్ కలెక్టర్
నిజామాబాద్, 15 ఫిబ్రవరి (హి.స) ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద
కలెక్టర్


నిజామాబాద్, 15 ఫిబ్రవరి (హి.స)

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande