శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్‌-10 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు
ప్రయాగ్‌రాజ్ 15 ఫిబ్రవరి (హి.స.)శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ భక్తజన సంద్రమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర త్రివేణి సంగమ ఘాట్‌లకు పోటెత్తారు. వార్షిక మాఘమేళాలో భాగంగా జరిగిన చివరి ‘స్నాన పర్వం’లో దాదాపు ఆచరించినట్లు
శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్‌-10 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు


ప్రయాగ్‌రాజ్ 15 ఫిబ్రవరి (హి.స.)శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ భక్తజన సంద్రమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర త్రివేణి సంగమ ఘాట్‌లకు పోటెత్తారు. వార్షిక మాఘమేళాలో భాగంగా జరిగిన చివరి ‘స్నాన పర్వం’లో దాదాపు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.

‘హర హర మహాదేవ శంభో’ అంటూ భక్తులు చేసిన శివనామస్మరణతో గంగా తీరం మార్మోగిపోయింది. భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతూనే ఉందని మాఘమేళా అధికారి రిషి రాజ్ మీడియాకు తెలిపారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ (ఏటీఎస్‌) మొబైల్ పెట్రోలింగ్ బృందాలు మేళా ప్రాంతంలో నిరంతరం పహారా కాస్తున్నాయి. ఘాట్‌ల వద్ద తొక్కిసలాట జరగకుండా క్రౌడ్ మేనేజ్‌మెంట్ బృందాలను రంగంలోకి దించారు. నెల రోజుల పాటు సాగిన మాఘమేళా వేడుక ప్రశాంతంగా ముగిసేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

శివరాత్రి సందడి కేవలం ప్రయాగ్‌రాజ్‌కే పరిమితం కాలేదు. ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం వెలుపల భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande