చిట్ ఫండ్స్ డైరెక్టర్ అరెస్ట్.. నర్సంపేట సబ్ జైలుకు తరలింపు..
వరంగల్, 15 ఫిబ్రవరి (హి.స.) అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో 2022లో నమోదైన కేసులో పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుండగా ఆ
Chitfund


వరంగల్, 15 ఫిబ్రవరి (హి.స.)

అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో 2022లో నమోదైన కేసులో పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుండగా ఆమెను అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి అమెరికాకు వెళ్తున్నారన్న సమాచారం మేరకు అప్రమత్తం అయ్యారు. బెంగుళూరు విమానాశ్రయంలో అరెస్టు చేసి రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఆమెకు రిమాండ్ విధించడంతో నర్సంపేట సబ్ జైలుకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande