
ములుగు, 15 ఫిబ్రవరి (హి.స.)
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల శివనామ స్మరణతో మారుమోగిపోయింది. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టూ ప్రక్కల గ్రామాల్లోని నుండి భక్తులు ఆలయాలను చేరుకుని శివలింగాలకు అభిషేకం చేశారు. రామప్ప ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఉపవాసం ఉన్న భక్తులకు కందగడ్డ,అరటిపండ్లు, అందజేశారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తీర్థ ప్రసాదాలు, తాగునీటి సౌకర్యం, ఏర్పాట్లు చేశారు, శివపార్వతుల కళ్యాణం, భక్తుల జాగరణ కోసం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు