
నారాయణపేట, 15 ఫిబ్రవరి (హి.స.) నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మేజార్టి రావడంతో చైర్మన్ కుర్చీపై చాలామంది ఆశ పెట్టుకున్నారు.
చైర్మన్ రేసులో ఆశావహుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో అనే చర్చ పీఠంపై ఆశలు పెంచుకున్న వారి ఆశయం నెరవేరుతుందా..మంత్రి వాకిటి శ్రీహరి మదిలో ఎవరున్నారని ఆలోచింపచేస్తున్న ప్రశ్న? పార్టీని అంటిపెట్టు కొన్ని అధికారంలో లేనప్పుడు తన వెంబడి ఉన్న వారికి ఇప్పటివరకు నామినేట్ పదవుల్లో ఇచ్చిన మంచి పేరు మంత్రి ఉంది దాన్నే అమలు చేస్తారా అన్నది ప్రశ్న.. ఎవరిని చేసినా మహిళామణి పుర చైర్మన్ గా ఉంటుంది. దీని అడ్డం పెట్టుకొని పతులు వ్యవహరించే తీరుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీని పట్టణ ప్రజలు కట్టబెట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ జరిగిన 15 వార్డులకు కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేయగా మూడు బిజెపి కైవసం చేసుకోంది.
ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యం అధికార పార్టీకి ఉండడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంధన ప్రాయంగా మారింది మక్తల్ మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ కావడంతో చైర్మన్ పీఠం పై ఎవరిని కూర్చో పెడతారనేది సర్వత చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ పీఠంపై ఆశలు పెంచుకున్న వారి ఆశయం నెరవేరుతుందా లక్ష్యం వేరుకోగలరా పట్టణంలో చర్చ ఏ నల్గురు కలిసిన చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు మంత్రి ఎవరికి కట్టబె డతారో ఇరవై నాలుగు గంటల తర్వాత తేలుతుంది. సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం ఎందుకు అన్ని రకాలుగా అవకాశం ఉన్న గత 70 ఏళ్లుగా 14 మంది ఎమ్మెల్యేలు మారిన అభివృద్ధిలో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. స్తానికునిగా మక్తల్ ఎమ్మెల్యేగా నెగ్గి అదృష్టం కొద్దీ మంత్రి పదవి రావడంతో మక్తల్ పట్టణాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు