
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టీ20 టోర్నీలో భారత్ పాక్‌పై ఘన విజయం సాధించింది. బ్యాంకాక్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను భారత బౌలర్లు 93 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూల్చారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా (10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి) ఛేదించారు. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరింది. దీనికి ముందు మ్యాచ్‌లో భారత అమ్మాయిలకు యూఏఈ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు