ఫాస్టాగ్‌ వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్‌హెచ్‌ఏఐ తాజా హెచ్చరిక!
ఢిల్లీ,15 ఫిబ్రవరి (హి.స.) ఫాస్టాగ్‌ FASTag యాన్యువల్‌ పాస్‌కు భారీ ఆదరణ లభించింది. దీన్ని ప్రారంభించిన ఆరు నెలల్లోనే 50లక్షలకుపైగా వినియోగదారులను అధిగమించింది. దీంతో ఇక్కడ కూడా నకిలీల బెడద తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే FASTag వార్షిక పాస్ సేవకు సం
ఫాస్టాగ్‌ వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్‌హెచ్‌ఏఐ తాజా హెచ్చరిక!


ఢిల్లీ,15 ఫిబ్రవరి (హి.స.)

ఫాస్టాగ్‌ FASTag యాన్యువల్‌ పాస్‌కు భారీ ఆదరణ లభించింది. దీన్ని ప్రారంభించిన ఆరు నెలల్లోనే 50లక్షలకుపైగా వినియోగదారులను అధిగమించింది. దీంతో ఇక్కడ కూడా నకిలీల బెడద తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే FASTag వార్షిక పాస్ సేవకు సంబంధించిన పెరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్ గురించి పౌరులను హెచ్చరిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక హెచ్చరిక జారీ చేసింది. నకిలీల బారిన పడకుండా కేవలం అధికారిక FASTag పోర్టల్‌లను మాత్రమే ఉపయోగించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఒకసారి చూద్దాం.

నకిలీ వెబ్‌సైట్ల ద్వారా జరుగుతున్న FASTag మోసాల పట్ల NHAI వాహనదారులను హెచ్చరించింది. మోసగాళ్లు అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉండే నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను నిలువునా ముంచుతున్నారని వెల్లడించింది.

అధికారిక NHAI ప్లాట్‌ఫారమ్‌లలాగానే నటించి, నకిలీ వార్షిక పాస్‌ల కోసం చెల్లింపులు చేయడానికి వినియోగదారులను మోసగిస్తున్న అనేక ఘటనల నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌ఐ ఈ హెచ్చరిక జారీ చేసింది.

ఈ మోసపూరిత పోర్టల్‌లలో చెల్లింపులు చేసిన తర్వాత అనేక మంది బాధితులు తక్షణ ఆర్థిక నష్టాలను నివేదించారు. కొంతమంది వినియోగదారులు కస్టమర్ సపోర్ట్‌గా నటిస్తూ, నకిలీ పాస్‌ను యాక్టివేట్ చేయడానికి OTPలు లేదా అదనపు ఛార్జీలను అడుగుతూ ఫాలో-అప్ స్కామ్ కాల్స్‌ కూడా చేస్తారు.ఈ స్కామ్‌లు అధికారిక బ్రాండింగ్, లోగోలు , లేఅవుట్‌లను కాపీ చేయడం వలన వినియోగదారులు చూడగానే తేడాను గుర్తించడం కష్టతరం చేస్తాయని సైబర్ అధికారులు గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande