
విశాఖ 15 ఫిబ్రవరి (హి.స.) సాగరతీరం విభిన్న నౌకలతో అలలారుతుంది. కొత్త కాంతులను వెదజల్లుతుంది. ఒకటి కాదు... రెండు కాదు... 70కి పైగా యుద్ధ నౌకలు... ధవళ వస్త్రాలతో నేవీ సిబ్బంది చేసే విన్యాసాలు... పది రోజుల పాటు సందడే సందడి...
భారత నౌకాదళం అరుదుగా నిర్వహించే ‘అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష’ (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ - ఐఎఫ్‌ఆర్)కు విశాఖపట్నం మరోసారి వేదికగా మారింది. దేశంలో ఇప్పటిదాకా రెండుసార్లు ‘ఐఎఫ్‌ఆర్’ నిర్వహించగా మొదట ముంబైలో (2001), పదేళ్ల క్రితం విశాఖలో (2016) జరిగింది. దశాబ్దం తరువాత తిరిగి (2026) విశాఖనే ఎంపిక చేయడం విశేషం. ఈ ఉత్సవానికి 50 దేశాల నుంచి నాలుగు వేల మంది అతిథులు, 70కి పైగా యుద్ధనౌకలు వస్తున్నాయి. ఇదేకాకుండా రెండేళ్లకొకసారి భారత నౌకాదళం నిర్వహించే ‘మల్టీ లేటరల్ నేవల్ ఎక్సర్‌సైజెస్ (మిలాన్)’ కూడా ఈసారి విశాఖలోనే నిర్వహిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ