బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ ప్రమాణం.. ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం
ఢాకా, 15 ఫిబ్రవరి (హి.స.) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ కాబోయే ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నుంచి ఆహ్వానం అందింది. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తారిఖ్
రెహ్మాన్


ఢాకా, 15 ఫిబ్రవరి (హి.స.)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ కాబోయే ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నుంచి ఆహ్వానం అందింది. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తారిఖ్ రెహ్మాన్ ఫిబ్రవరి 17న కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ పార్లమెంటు హౌస్‌లోని సదరన్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం 13 దేశాలకు ఆహ్వానం పంపించింది. ఇందులో భారత్‌తో సహా చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ, ఖతార్, శ్రీలంక, నేపాల్ తదితర దేశాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం వచ్చాక భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆహ్వానం అందడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా ఆయన తరఫున ఎవరైనా హాజరవుతారా అనేది తెలియాల్సి ఉంది. బంగ్లాదేశ్ ఆహ్వానంపై అధికారికంగా భారత్ ధ్రువీకరించాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande