తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి సమయం ఇదే!
తిరుమల, 15 ఫిబ్రవరి (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. అయితే, ఇవాళ వీకెండ్, మహాశివరాత్రి కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండపై భక్తుల ర
తిరుమల


తిరుమల, 15 ఫిబ్రవరి (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. అయితే, ఇవాళ వీకెండ్, మహాశివరాత్రి కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(ఆదివారం) శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి ఏటీజీహెచ్ సర్కిల్ వరకు వేచి ఉన్నారు. తిరుమల భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 82,337 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.58 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande