
అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స.),:ఎన్నికల హామీ మేరకు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలనకు పంపిన అనంతరం కేంద్రం అనుమతితో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానికి బీసీ నేతలు, నిపుణులతో చర్చించి, మంత్రివర్గ ఉపసంఘం నియమించి ముసాయిదా సిద్ధం చేసింది. బీసీలపై దాడులకు పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ముసాయిదాను అక్కడినుంచి క్యాబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదానికి పంపాలని భావించారు. అయితే న్యాయకోవిదుల సూచనల మేరకు బిల్లును ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ పంపి, పరిశీలన అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీ రక్షణచట్టం మన రాష్ట్రంలోనే మొదటిసారి తీసుకొస్తుండటంతో ఈ చట్టం రూపకల్పనపై ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు మరికొంత సమయం తీసుకోవాలని యోచిస్తున్నారు. దీంతో అసెంబ్లీలో చట్టం చేసేముందు జాతీయ బీసీ కమిషన్‌కు ముసాయిదాను పంపి, వారి సూచనలు, సలహాలతో చట్టం చేయాలని నిర్ణయించారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో పనిదినాలు తక్కువగా ఉండటంతో ఈలోపు జాతీయ బీసీ కమిషన్ నుంచి ముసాయిదా పరిశీలన పూర్తయి రావడం కుదరదని భావిస్తున్నారు. దీంతో వచ్చే సమావేశాల్లోనో లేదా ఆర్డినెన్స్ ద్వారానో చట్టం చేసే అవకాశముంది. తాజా అసెంబ్లీ ఎన్ ఎన్ ఎం ఎం ఎం ఎం
మం ఎం ఎం ఎం ఎం ఎం ఎంసమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేదని పేర్కొంటున్నారు. ఈచట్టం శిక్షలకు సంబంధించినది. ఈ అంశం రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రం అనుమతి అవసరం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ