గేట్స్ ఫౌండేషన్. వ్యవస్థాపక చైర్మన్ ఓం బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించనున్నారు
అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స.) గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ సోమవారం అమరావతిలో వ్యవస్త వైఎస్ పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం సచివాలయానికి రానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్
గేట్స్ ఫౌండేషన్. వ్యవస్థాపక  చైర్మన్ ఓం బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించనున్నారు


అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స.) గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ సోమవారం అమరావతిలో వ్యవస్త వైఎస్ పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం సచివాలయానికి రానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లతో వారు సమావేశమవుతారు. సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని బిల్‌గేట్స్‌ సందర్శిస్తారు. ఆర్టీజీఎస్‌ విధానాలు, సాధిస్తున్న ఫలితాల్ని గేట్స్‌కు చంద్రబాబు వివరిస్తారు. అనంతరం బిల్‌గేట్స్‌ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమవుతారు. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చిస్తారు.

స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు ప్రజంటేషన్‌ ఇస్తారు. మెడ్‌టెక్, డయాగ్నొస్టిక్స్‌ సేవలు, సాగులో సాంకేతికత వినియోగం సహా తదితర ప్రాజెక్టుల ki గురించి వివరిస్తారు. ప్రత్యేకించి గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి తెలియజేస్తారు. అనంతరం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని చంద్రబాబుతో కలిసి గేట్స్‌ బృందం సందర్శించనుంది. డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానా నీన్ని వీరు పరిశీలిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande