మేఘ ఇంజనీరింగ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ
అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్‌: మేఘా ఇంజినీరింగ్‌ గ్రూప్‌ సంస్థ ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, మాజీ ఐపీఎస్‌ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా చేసినప్పటి నుంచి జేడీ
మేఘ ఇంజనీరింగ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఐపీఎస్ అధికారి  జేడీ లక్ష్మీనారాయణ


అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స.)

హైదరాబాద్‌: మేఘా ఇంజినీరింగ్‌ గ్రూప్‌ సంస్థ ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, మాజీ ఐపీఎస్‌ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా చేసినప్పటి నుంచి జేడీ లక్ష్మీనారాయణగా ఆయన ప్రసిద్ధులు. 1990 మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన లక్ష్మీనారాయణ విధుల్లో నిబద్ధతతో వ్యవహరిస్తూ, సంచలనాలకు కారణమయ్యారు.

విద్యార్థిగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ను వరంగల్‌ ఎన్‌ఐటీలో, ఎంటెక్‌ను ఐఐటీ మద్రాస్‌లో ఆయన అభ్యసించారు. మేఘా గ్రూప్‌లోని విద్యుత్తు వాహనాల నమోదిత సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ అనుబంధ సంస్థే ఈవీ ట్రాన్స్‌. వివిధ రాష్ట్రాలకు ఒలెక్ట్రా సంస్థ గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ) పద్ధతిలో సరఫరా చేస్తున్న విద్యుత్తు బస్సులకు అవసరమైన ఛార్జింగ్‌ వ్యవస్థలు నిర్మించడంతో పాటు ఆయా బస్సుల నిర్వహణ బాధ్యతలన్నీ చూసేదే ఈవీ ట్రాన్స్‌. ప్రస్తుతం 900కు పైగా బస్సులను ఈ సంస్థ నిర్వహిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande