
భివాడీ: 16, ఫిబ్రవరి (హి.స.)
రాజస్థాన్‌లోని ఖేర్తల్-తిజారా జిల్లా భివాడీలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఖుష్ఖేరా కరౌలి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 25 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది బయటపడలేక ఫ్యాక్టరీలోనే సజీవ దహనమయ్యారు.
పోలీసులు గస్తీలో ఉండగా ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏఎండీ) సుమితా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో కార్మికుడు ఇంకా లోపలే చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ