గ్రామీణ .పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం 1,876కోట్లు
అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స.), గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,876 కోట్లు కేటాయించిందని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.143 కోట్లు అధి
గ్రామీణ .పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం 1,876కోట్లు


అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స.), గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,876 కోట్లు కేటాయించిందని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.143 కోట్లు అధికం అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల సాధికారత, గ్రామీణ జీవనోపాదుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ధృడ సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన కుటుంబానికో పారిశ్రామికవేత్త మహత్తర లక్ష్య సాధనలో భాగంగా సుమారు ఐదు లక్షల మంది మహిళలను ఔత్సాహికులుగా తీర్చిదిద్దడం, రైతు ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande