
నిజామాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం
అనైతిక పొత్తుతో ఏర్పడిన నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation) పాలకవర్గం పదవి కాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేయర్, డిప్యూటీ మేయర్ టర్మ్ పూర్తి కాకుండానే ఇక్కడ బీజేపీ మేయర్ పీఠం ఎక్కుతారని ఇది నా మాటగా చెబుతున్నానని అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ను కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటై బీజేపీని ఓడించాయని స్వల్ప మెజారిటీతో తాము ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి అక్బరుద్దీన్ వచ్చి హిందువులకు దూషించినా ఆత్మభిమానాన్ని అంతె చంపుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసిపోయిందన్నారు.
రేవంత్ ఎందుకు తేలిపోయింది: కాపాడుతున్నాడో
కాళేశ్వరం, ఈ కార్ రేస్ కేసుల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు?, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ ఎందుకు కాలిపోతుంది అనేది ఈ పొత్తులతో అందరికీ అర్థం అవుతుందన్నారు. నిజామాబాద్ లో బీజేపీని ఓడించేందుకు అనైతిక పొత్తుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడితే ఇందుకు పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు. కొంత మంది పోలీసులు రంగుపులుముకుని వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్ ను ఎత్తుకెళ్లి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేలా పోలీసులు చేశారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు