
నారాయణపేట, 16 ఫిబ్రవరి (హి.స.)
నారాయణపేట మున్సిపల్ చైర్మన్ పదవి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కొండ సత్య యాదవ్ను వరించింది.
నారాయణపేట పురపాలక ఎన్నికల్లో చైర్మన్ పదవి కోసం ప్రధాన పార్టీల మధ్య ఎన్నో మలుపులు తిరిగి చివరకు మున్సిపాలిటీ పై కాషాయ జెండా ఎగరవేయడంలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సక్సెస్ అయ్యారు. వైస్ చైర్మన్గా ఆరవ వార్డు అభ్యర్థి మంజుల రాఘవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. బీజేపీ నుండి 12 మంది అభ్యర్థులు గెలుపొందగా చైర్మన్ పదవి కోసం నలుగురు పోటీ పడ్డారు. బీజేపీలో కౌన్సిలర్లలో ఎలాంటి మనస్పర్ధాలు రాకుండా, కాంగ్రెస్ శిబిరానికి అభ్యర్థులు చేజార్చకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో ఆ పార్టీ నాయకులు సక్సెస్ కావడంతో చైర్మన్ పదవిని దక్కించుకున్నారు.
కోడలిని కాదని అత్తకు..
నారాయణపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో రాజకీయ అత్త కోడలు హోరులో చివరకు అత్తనే పై చేయి సాధించింది. చైర్మన్ ఎన్నికకు బీజేపీ నుంచి కొండా శ్వేతా సత్య యాదవ్ను ప్రతిపాదించగా ఆమెకు ఎక్సాఫీయో ఓటుతో పాటు 13 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి రామ్ చందర్ చైర్ పర్సన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి గొల్ల రవికుమార్ చైర్మన్ పదవి కోసం ప్రతిపాదించగా ఎక్స్ అఫీషియో ఓటుతోపాటు 11 ఓట్లు వచ్చాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి 11వ వార్డు అభ్యర్థి డాక్టర్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో వైస్ చైర్మన్ పదవికి ప్రతిపాదించగా 9 ఓట్లు రావడం విశేషం. కాంగ్రెస్ శిబిరంలో ఉన్నటువంటి ఎంఐఎం అభ్యర్థులు ఈ వ్యక్తికి ఓటు వేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మున్సిపల్ఎన్నిక ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి బిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ హాజరు కాకపోవడంతోపాటు వారు తటస్థంగా ఉండడంతో చైర్మన్ పదవి ఎన్నిక సునాయాసంగా బీజేపీ తన వశం చేసుకుంది.
చేజార్చుకున్న కాంగ్రెస్ పార్టీ..
పట్టణ ప్రజలు జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్ల తరబడి బీజేపీ నుండి కొండా శ్వేతా సత్తా యాదవ్ను ఉన్నత పదవులు చూడాలని కోరుకున్నట్టుగానే ఆమెకు చైర్ పర్సన్ పదవి రావడంతో పార్టీ శ్రేణులతోపాటు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు