ఇది ప్రజా తీర్పుకు నిదర్శనం : డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం, 16 ఫిబ్రవరి (హి.స.) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయం అని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్ట
భట్టి


ఖమ్మం, 16 ఫిబ్రవరి (హి.స.)

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయం అని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం మధిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని బురద చల్లినా వారికి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమని కొనియాడారు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కట్టబెట్టారని, విజయం అందించిన ప్రతి ఓటరుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమిష్టిగా పనిచేస్తూ.. అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకంతో ముందుకు తీసుకెళ్ళి, అర్బన్ సెంటర్లను అభివృద్ధి బాట పట్టించారని భట్టి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande