హైదరాబాద్ కమిషనరేట్లో భారీ కుదుపు.. ఏకంగా 63 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ
హైదరాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) పరిపాలనా సౌలభ్యం కోసం పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 63 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ అధికారిక ఉత్తర్వులు జారీ చ
ట్రాన్స్ఫర్


హైదరాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.)

పరిపాలనా సౌలభ్యం కోసం పోలీసు

శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 63 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 14న జరిగిన పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆదివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన వారిలో చాలామంది కీలక పోలీస్ స్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (SHO) నియమితులయ్యారు. మరికొందరు స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, క్రైమ్ విభాగాలకు బదిలీ అయ్యారు. అందులో టి.రాంబాబు స్పెషల్ బ్రాంచ్ నుంచి చార్మినార్ ఎసైచ్వోగా, యు. శ్రీనివాసులు రెడ్డి సైఫాబాద్ ఎన్హెచ్్వ నుంచి జూబ్లీహిల్స్ ఎసాచ్వోగా, ఎ.సీతయ్య ఫలక్నుమా ఎన్హెచ్వో నుంచి సైఫాబాద్ ఎన్హెచ్వోగా, ఎస్.కోటేశ్వర్ రావు ఆసిఫ్నగర్ ట్రాఫిక్ నుంచి ఛత్రినాక ఎన్హెచ్వోగా ఎన్.మోహన్ రావు ఛత్రినాక ట్రాఫిక్ నుంచి అఫ్టైల్గంజ్ ఎసెచ్వోగా బదిలీ అయ్యారు.

తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశాలు..

ఇక వెయిటింగ్లో ఉన్న పలువురు ఇన్స్పెక్టర్లతో పాటు మరికొంతమందికి స్పెషల్ బ్రాంచ్లో ఇచ్చారు. వారిలో కె. శ్రీనివాసులు, కె. చంద్రశేఖర్, సిహెచ్. పరశురామ్ పోస్టింగ్లు కె.ఆదిరెడ్డి, తదితరులు ఉన్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ విభాగానికి కె.నారాయణ రెడ్డి, యు.చంద్రశేఖర్లు නයිර්ම అయ్యారు. షీ టీమ్ (SHE Team) బాధ్యతలు టి.వంశీ కృష్ణ రావుకు అప్పగించారు. భరోసా సెంటర్ బాధ్యతలను పల్లె పద్మకు కేటాయించారు. బదిలీ అయిన అధికారులందరినీ తక్షణమే విధుల్లోంచి రిలీవ్ చేయాలని, వారు వెంటనే తమకు కేటాయించిన కొత్త పోస్టింగ్లలో రిపోర్ట్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేసి, నివేదిక సమర్పించాలని సంబంధిత (Compliance Report) ఉన్నతాధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande