కోఠి కాల్పుల కేసులో పురోగతి.. హర్యానాలో ఒక నిందితుడు అరెస్ట్
హైదరాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.) మహానగరంలో అత్యంత రద్ద ప్రాంతమైన కోఠి (Koti) ఎస్బీఐ ఏటీఎం వద్ద కేరళ (Kerala) వ్యాపారిపై కాల్పులు జరిపి నగదు దోచుకున్న కేసులో తెలంగాణ టాస్క్ ఫోర్స్ (Telangana Task Force Police) పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుల
Firing


హైదరాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.)

మహానగరంలో అత్యంత రద్ద ప్రాంతమైన కోఠి (Koti) ఎస్బీఐ ఏటీఎం వద్ద కేరళ (Kerala) వ్యాపారిపై కాల్పులు జరిపి నగదు దోచుకున్న కేసులో తెలంగాణ టాస్క్ ఫోర్స్ (Telangana Task Force Police) పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిని పోలీసులు హర్యానా (Haryana)లో చాకచక్యంగా పట్టుకున్నారు. అతడు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం పోలీసులు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే, విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ ముఠా గత 3 నెలల నుంచే ఈ భారీ దోపిడీకి ప్రణాళిక రచించినట్లుగా వెల్లడైంది. బాధితుడి కదలికలపై నిఘా ఉంచి, ఏ సమయంలో నగదు డిపాజిట్ చేస్తాడనే అంశంపై వీరు ముందే రెక్కీ నిర్వహించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande