తొలి విడత సీపీఐదే.. కొత్తగూడెం మేయర్‌గా గణేశ్‌
కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌గా సీపీఐకి చెందిన గణేశ్‌ ఎన్నికయ్యారు.
Political parties


హైదరాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.)కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌గా సీపీఐకి చెందిన గణేశ్‌ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా లలిత కుమారి (కాంగ్రెస్‌) ఎన్నికయ్యారు. కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ పీఠంపై నిన్నటి వరకు ఉత్కంఠ కొనసాగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌, సీపీఐ మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను చెరో రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి.

ఈ ఒప్పందం ప్రకారం తొలుత సీపీఐకి చెందిన గణేశ్‌ను మేయర్‌గా ఎన్నుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి (కాంగ్రెస్‌-22, సీపీఎం-1) 23 డివిజన్లలో విజయం సాధించింది. సీపీఐకి 22, బీఆర్‌ఎస్‌-8, భాజపా-1, స్వతంత్రులు 6 డివిజన్లలో గెలుపొందింది. మరోవైపు రామగుండం కార్పొరేషన్‌ను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఆ పార్టీకి చెందిన మహంకాళి స్వామి ఎన్నికయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande