మంచిర్యాల కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కైవసం.. బైంసా ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.
Places


హైదరాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.)ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. తొలి మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య ఎన్నికయ్యారు. మరోవైపు ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, భారాస, ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో ఛైర్‌పర్సన్‌గా బండారి అనూష, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా మహ్మద్‌ రోహిత్‌ ఎన్నికయ్యారు.

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీని భారాస కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా మెంగ్రే ఆకాశ్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా అహ్మద్‌ ఎన్నికయ్యారు. బైంసా మున్సిపాలిటీలో.. భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్‌, స్వతంత్రుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి తూమెల్ల దత్తాత్రి ఛైర్మన్‌గా, ఖతుజా సిద్ధికి ఇద్రిస్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నిర్మల్‌ మున్సిపాలిటీని కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా.. భార్యాభర్తలు అప్పాల కావ్య, అప్పాల గణేశ్‌ చక్రవర్తి ఛైర్‌పర్సన్‌, ఉప ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఛైర్మన్‌ పదవిని కాంగ్రెస్‌ హస్తగతం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా దొంత అంజలీ దేవి, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా మోత్కూరి రాజేశ్వరి ఎన్నికయ్యారు.

చెన్నూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. ఛైర్‌పర్సన్‌గా పెద్దింటి పద్మ, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా నాయకపు వినయ్‌ ఎన్నికయ్యారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా.. ఛైర్మన్‌గా దావ స్వాతి, వైస్‌ ఛైర్మన్‌గా రాగంశెట్టి సత్యనారాయణ ఎన్నికయ్యారు. కాగా, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖానాపూర్‌, కాగజ్‌నగర్‌, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం ఒక కార్పొరేషన్‌, 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande