'నా మనసు గర్వంతో నిండిపోయింది'.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
నల్గొండ,16 ఫిబ్రవరి (హి.స.) నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ నూతన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ''నల్లగొండ
కోమటిరెడ్డి


నల్గొండ,16 ఫిబ్రవరి (హి.స.)

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ నూతన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు నా కల.. ఆ కల సాకారమై, ఇవాళ అభ్యర్థులు ప్రజాప్రతినిధులుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే నా మనసు గర్వంతో నిండిపోయింది. నల్లగొండ జన్మభూమి, ఇక్కడి ప్రతి గల్లీ నా గుండె చప్పుడు. నల్లగొండను కేవలం ఒక పట్టణంగా కాదు, దేశం గర్వించేలా ఒక 'క్లీన్ - గ్రీన్ - స్మార్ట్ సిటీ' (Clean, Green & Smart City)గా తీర్చిదిద్దడమే నా జీవిత ఆశయం. రాజకీయాలకు తావు లేకుండా, మేము ఓడిపోయిన డివిజన్లలో సైతం అభివృద్ధి గంగా ప్రవాహంలా సాగుతుంది. ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమం, ప్రతి వీధికి ఆధునిక వసతులు చేరడమే నా బాధ్యత. మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి, డిప్యూటీ మేయర్కి మరియు నూతన కార్పొరేటర్లకు నా అభినందనలు. నాటి ఫ్లోరోసిస్ వ్యతిరేక పోరాటం నుండి నేటి స్మార్ట్ సిటీ నిర్మాణం వరకు.. మీ 'కోమటిరెడ్డి' ఎప్పుడూ మీ తోడుగానే ఉంటాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande