
ములుగు, 16 ఫిబ్రవరి (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజాసేవకే అంకితం కావాలని మంత్రి సీతక్క అన్నారు. పదవుల కోసం ప్రతి ఒక్కరు ఆశపడటం సహజమేనని, పార్టీ నిబంధనలు ప్రతి ఒక్కరూ కట్టుబడి నడుచుకోవాలని అన్నారు. సోమవారం మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల నియామకం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులను మెజార్టీ సార్లు గెలిపించుకోవడం జరిగిందనీ తిరిగి నేడు ములుగు నూతన మున్సిపాలిటీ అయిన అనంతరం ఇరువై స్థానాల్లో 12 స్థానాలు గెలిచి విజయ ఢంకా మోగించామని అన్నారు. గత 20 సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన చింత నిప్పుల చంద్రకళ బిక్షపతి కి చైర్మన్ పదవి అవకాశం ఇవ్వడం జరిగిందని రెండు సంవత్సరాల పాలన అనంతరం తిరిగి నిర్ణయం చేయడం జరుగుతుందని మంది అభ్యర్థులు గెలుపొందడమే కాకుండా పార్టీకి చెందిన ఇద్దరు రెబల్ అభ్యర్థులు విజయం సాధించారని, పార్టీకి అండగా నిలిచిన ఓటర్లకు సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. చేసే అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ సహకరించాలని సీతక్క కోరారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు