
అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స. హైదరాబాద్: తమ ఖాతాదారుల కోసం ఎస్‌బీఐ కొత్త ప్రమాదబీమా పథకాన్ని ప్రారంభించింది. ఖాతాదారులు ఏడాదికి రూ.3 వేలు చెల్లిస్తే రూ.60 లక్షల బీమా అందిస్తోంది. అంటే రోజుకు రూ.8.2. ఖాతా నుంచి ఈ పథకానికి రూ.3 వేలు తీసుకోవడానికి అంగీకారం తెలపాలి. ఒకసారి అంగీకారపత్రం ఇస్తే ఏటా ఆటోమేటిక్ రెన్యువల్బ్‌పొడిగింప్శు సౌకర్యాన్ని కల్పిస్తోంది. బీమా తీసుకున్న వ్యక్తి రోడ్డుప్రమాదం, విపత్తులు, పాముకాటు వంటి వాటివల్ల మరణిస్తే.. మరణ ధ్రువీకరణ పత్రాన్ని బ్యాంకులో సమర్పిస్తే రూ.60 లక్షల ప్రమాద బీమా పరిహారాన్ని నామినీ ఖాతాలో జమచేస్తారు.
కుటుంబ యజమాని చనిపోతే ఇద్దరు పిల్లల చదువులకు రూ.20 వేల పరిహారం అదనంగా ఇస్తారు. అంత్యక్రియలకు రూ.10 వేలు, అంబులెన్స్‌కి రూ.1500 ఇస్తారు. ఆత్మహత్య చేసుకున్నా, డ్రగ్స్ తీసుకుని మరణించినా, ఇతర ఏ వ్యాధులు సోకి మరణించినా ఈ బీమా వర్తించదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ