‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు!
కోల్‌కతా:16, ఫిబ్రవరి (హి.స.) పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ విధులలో నిర్లక్ష్యం, అధికారాల దుర్వినియోగానికి పాల్పడిన ఏడుగురు అధికారులను
ગુજરાતમાં SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં 4.34 કરોડ મતદારો નોંધાયા,73.73 લાખ મતદારોના નામ કપાયા


కోల్‌కతా:16, ఫిబ్రవరి (హి.స.)

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ విధులలో నిర్లక్ష్యం, అధికారాల దుర్వినియోగానికి పాల్పడిన ఏడుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్‌ఓ)హోదాలో ఉన్న ఈ అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.

సస్పెన్షన్‌కు గురైన అధికారులలో సంషేర్‌గంజ్, ఫరక్కా, మైనాగురి, సూతి, కానింగ్ పూర్బో, డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఏఈఆర్‌ఓలు ఉన్నారు. ముర్షిదాబాద్ జిల్లా సంషేర్‌గంజ్ ఏఈఆర్‌ఓ సెఫౌర్ రెహమాన్, ఫరక్కా ఏఈఆర్‌ఓ నితీష్ దాస్, మైనాగురి ఏఈఆర్‌ఓ డాలియా రాయ్ చౌదరి, సూతి ఏఈఆర్‌ఓ ముర్షీద్ ఆలంలపై వేటు పడింది. అలాగే కానింగ్ పూర్బో నియోజకవర్గానికి చెందిన సత్యజిత్ దాస్, జయదీప్ కుందు, డెబ్రా ఏఈఆర్‌ఓ దేబాశిష్ బిస్వాస్‌లను ఈసీ విధుల నుంచి తొలగించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande