
అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స.)
ఏపీ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్.. సచివాలయంలో RTGS ను సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరును పరిశీలించారు. డిస్ ప్లే వాల్స్ పై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్లను పరిశీలించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్ సంజీవని, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంజీవనితో ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతాయని సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని, అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్ సమాచారాన్ని సేకరిస్తున్నామని సీఎం వివరించారు. అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను అంచనా వేస్తున్నామని తెలిపారు.
కాగా.. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ అడగ్గా.. అందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వాడుతున్నామని, దాని ద్వారానే ల్యాండ్ రికార్డుల్ని భద్రపరుస్తున్నామని అధికారులు వివరించారు. క్యూఆర్ కోడ్ విధానంతో పారదర్శక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. డేటాలేక్, వాట్సప్ గవర్నెన్స్ (Whats app governance) ద్వారా రాష్ట్రపాలనలో పౌర సేవలను మరింత సుభలతరం చేయడం బాగుందని బిల్ గేట్స్ ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న తీరును పరిశీలించారు. అలాగే పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టు అమలు గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్ టెస్టుల వివరాలను ఎలా నమోదు చేస్తారో అధికారులు ఆయనకు వివరించారు. రాష్ట్రంలో డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ ఖర్చుకే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని బిల్ గేట్స్ సూచించారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణ తీ
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV