ప్రియంకా చోప్రా భారత్‌కు గర్వకారణం: శశి థరూర్
కేంబ్రిడ్జి:/ఢిల్లీ, 16, ఫిబ్రవరి (హి.స.) అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘ఇండియా కాన్ఫరెన్స్ 2026’ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ బ్యాక్‌స్టేజ్‌లో భేట
Sasi tharoor


కేంబ్రిడ్జి:/ఢిల్లీ, 16, ఫిబ్రవరి (హి.స.)

అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘ఇండియా కాన్ఫరెన్స్ 2026’ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ బ్యాక్‌స్టేజ్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రియాంక చోప్రాతో దిగిన ఫోటోలను ‘ఎక్స్‌’వేదికగా షేర్‌ చేస్తూ, ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘భారతీయులు అరుదుగా కనిపించే అంతర్జాతీయ వేదికలపై, దేశం గర్వపడేలా ప్రియాంక రాణిస్తోంది. ఆమె అద్భుతంగా కనిపిస్తోంది. ఎంతో హుందాగా, విజ్ఞతతో మాట్లాడుతోంది. ఇంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది?’ అని థరూర్ తన ట్వీట్‌లో‌ రాశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande